Alia Bhatt: సినిమా కోసం మా అమ్మను వేశ్యగా మార్చారు: గంగూబాయ్‌ కొడుకు ఆవేదన

Mumbai Lady Don Gangubai Family Fires On Gangubai Kathiawadi Movie Team - Sakshi

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ తాజాగా నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్ల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సినిమా ట్రైలర్‌ విడుదలై ప్రజాదరణ పొందింది. ముంబయిలోని మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితం ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వేశ్యగా జీవితం మొదలు పెట్టాల్సి వచ్చినా.. వాటన్నింటిని ఎదుర్కొని మాఫియా డాన్‌గా ఎదిగిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

చదవండి: ట్రోల్స్‌పై స్పందించిన మోహన్‌ బాబు, ఆ హీరోలే ఇలా చేయిస్తున్నారంటూ సీరియస్‌

అయితే ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై గంగూబాయి తనయుడు బాబూ రావుజీ షా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన తల్లిని ఇందులో వేశ్యగా చూపించి అవమానపరిచారంటూ గతేడాది ఈ చిత్రంపై డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ,  అలియా భట్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ముంబై కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు ​జారీ చేసింది. ఆ తర్వాత సినిమా విడుదలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే చిత్ర నిర్మాతలపై క్రిమినల్, పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే కూడా ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉండగా మూవీ రిలీజ్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్‌.

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ‘ఏం మాయ చేశావే’ నటుడు కన్నుమూత

దీంతో గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు రావుజి షా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో బాబూ రావుజీ షా మాట్లాడుతూ.. ‘మీ సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు.ఇప్పుడు అనేకమంది మీ అమ్మ అసలు వేశ్యనా లేదా సామాజిక కార్యకర్తనా అంటూ అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. మా కుటుంబ మానసిక స్థితి బాగాలేదు. అమ్మగురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం’ అని వాపోయాడు. 

చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక గంగూబాయి మనవరాలు మాట్లాడుతూ.. ‘డబ్బు కోసం మా కుటుంబం పరువు తీశారు. ఈ మూవీ తీసేటప్పుడు కూడా మా కుటుంబం అనుమతి అడగలేదు. వారు పుస్తకం రాసేటప్పుడు కూడా మా దగ్గరికీ రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి కావాల్సిందే. మా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను చాలా అభ్యంతరకరంగా చూపిస్తున్నారు’ అంటూ ఆమె బాధపడింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top