చాలా మంది అదే ప్రశ్న అడుగుతున్నారు: మృణాల్‌

Mrunal Thakur reacts on Bollywood Entry - Sakshi

సీతారామం చిత్రంలో కథానాయికగా నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన నటి మృణాల్‌ ఠాగూర్‌. నిజానికి ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే నటించాల్సింది. అయితే ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ అవకాశం నటి మృణాల్‌ ఠాగూర్‌ను వరించింది. ఈ బాలీవుడ్‌ భామ మొదట్లో మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. పలు వాణిజ్య ప్రకటనలో నటించి గుర్తింపు పొందిన ఈ అమ్మడు లవ్‌ సోనియా అనే చిత్రం ద్వారా కథానాయకిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

అలా కొన్ని చిత్రాలు చేసిన మృణాల్‌ ఠాగూర్‌కు బాలీవుడ్‌లో దక్కని సక్సెస్‌ దక్షిణాదిలో సీతారామంతో దక్కించుకుంది. దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి పేరు వెలుగులోకి వచ్చింది. సీతారామం చిత్రంలో చాలా సంప్రదాయ దుస్తుల్లో చక్కగా నటించి మెప్పించింది.

చదవండి: (ఆయనతో తొలి హిట్‌ సాధించా!)

అయితే తన ఒరిజినల్‌ స్వభావం అది కాదు వేరే ఉందంటూ గ్లామరస్‌ దుస్తులతో ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి రచ్చరచ్చ చేసింది. దీని గురించి అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ సీతారామం చిత్రానికి అంత ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే హిందీలో ఇప్పటి వరకు తనకు ఇలాంటి అవకాశం రాలేదని చెప్పింది. తాను బాగా నటిస్తానని హిందీ దర్శకులను నమ్మించడానికి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నానని, అయినా అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది.

అయితే వచ్చిన అవకాశాలతో సంతోషంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. కొందరు దర్శకుడు తనపై నమ్మకంతో అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొంది. అయితే చాలా మంది మీ వయసెంత అని అడుగుతున్నారని, తన వయసు 30 ఏళ్లు అని చెప్పగానే వెంటనే పెళ్లి చేసుకోమని, వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారని చెప్పింది. దీంతో ఓ అలానా.. అంటూ వారికి బై చెబుతున్నట్లు వివరించింది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top