
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుశ్తో డేటింగ్లో ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితమే తెగ వైరలైంది. ఆ తర్వాత తాజాగా మరోసారి ఆమె పేరు గట్టిగానే వైరలవుతోంది. దీనికి కారణం బాలీవుడ్ భామ బిపాసాను ఉద్దేశించి కామెంట్స్ చేయడమే. అయితే గతంలో మృణాల్ మాట్లాడిన ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో బిపాసా బసు సైతం పేరు ప్రస్తావించకుండానే కౌంటరిచ్చింది.
తాజాగా ఈ వివాదంపై మృణాల్ ఠాకూర్ స్పందించింది. గత కొన్ని రోజులుగా ట్రోలింగ్‌కు గురైన మృణాల్ ఠాకూర్ క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తాను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అలా తెలివితక్కువగా మాట్లాడానని తెలిపింది. నా మాటలు ఇలా బాధపెడతాయని నాకప్పుడు తెలియదని క్లారిటీ ఇచ్చింది. ఇలా జరిగినందుకు చింతిస్తున్నట్లు తన పోస్ట్లో రాసుకొచ్చింది.
మృణాల్ ఠాకూర్ తన ఇన్స్టాలో రాస్తూ..'నా 19 ఏళ్ల నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు తెలివితక్కువ మాటలు మాట్లాడాను. నేను సరదాగా అన్న మాటలు ఇలా బాధపెడతాయని నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నా. ఇక్కడ నా ఉద్దేశ్యం ఎవరి శరీరాన్ని అవమానించడం కాదు. అది చాలా ఏళ్ల క్రితం సరదాగా మాట్లాడిన మాటలు ఇంత దూరం వస్తాయని అనుకోలేదు. కానీ ఆ విషయం ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగానే నా పదాలు చాలా భిన్నంగా అనిపించాయి. కాలక్రమేణా అందానికి నిర్వచనం నాకు అర్థమైంది. మనసుతో చూస్తే ప్రతిదానిలో సౌందర్యం కనిపిస్తుంది.'అని పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ మృణాల్ ఠాకూర్‌ను ప్రశంసిస్తున్నారు. తన తప్పును అంగీకరించడం చాలా గొప్ప విషయమని కొనియాడుతున్నారు. అయితే తన పోస్ట్లో బిపాసా పేరు ప్రస్తావించక పోవడంపై కొందరు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అసలు మృణాల్ ఏమందంటే?
పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను బిపాసా కంటే అందంగా ఉంటాను. ఆమె కండలు తిరిగిన దేహంతో మగాడిలా కనిపిస్తుంది. ఆమెతో పోలిస్తే నేను చాలా బెటర్ అని కామెంట్స్ చేసింది. ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు బావీవుడ్ సినీతారలు సైతం సీతారామం బ్యూటీని విమర్శించారు.
మృణాల్‌కు బిసాపా కౌంటర్?
బలమైన మహిళలు ఎల్లప్పుడూ ఒకరి ఉన్నతి కోసం మరొకరు పాటుపడతారు. అందమైన స్త్రీలకు ఆ మజిల్స్ అవసరం. ఎందుకంటే.. మహిళలెప్పుడూ బలంగా, ధృడంగా ఉండాలి. అప్పుడే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. స్త్రీలు స్ట్రాంగ్‌గా కనిపించకూడదన్న పాతకాలపు ఆలోచనలను బద్ధలు కొట్టండి అని బిపాసా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
