
స్టార్ హీరోయిన్ నయనతార ( Nayanthara) ఈ మధ్య ఎక్కువ విమర్శలకు గురవుతుంది. రీసెంట్ గానే ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. మూకుత్తి అమ్మన్ 2 సినిమా పూజా కార్యక్రమాల్లో తోటి నటి మీనాను అవమానపరిచారు అంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా నయనతారపై మరో పుకారు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మూకుత్తి అమ్మన్ 2 సినిమా సెట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో నయనతార గొడవపడిందట. ఇదే విషయంపై దర్శకుడు సుందర్.సీ, నయనతారల మధ్య విభేధాలు రావడంతో షూటింగ్ నిలిపివేసిట్లు తెలుస్తోంది.
నయనతార హీరోయిన్‌గా సుందర్ సి దర్శకత్వంలో ‘మూకుతి అమ్మన్ 2’ (Mookuthi Amman 2) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా కాస్ట్యూమ్ విషయంలో నయనతార , ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన నయనతారకు నచ్చకపోవడంతో ఆమె ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌ను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది.
ఈ చిన్న విషయం కాస్త పెద్ద వివాదంగా మారడంతో దర్శకుడు సుందర్ సి షూటింగ్‌కు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు వినికిడి. నయనతార ప్రవర్తన సుందర్ సికి సంతృప్తి కలిగించకపోవడంతో, ఆమెను సినిమా నుంచి తొలగించి, మరో సీనియర్ నటిని తీసుకొని చిత్రాన్ని కొనసాగించాలనే ఆలోచన చేశాడట. అయితే నిర్మాత ఇషారి కె. గణేష్ జోక్యం చేసుకుని నయనతారతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారట. ప్రస్తుతం చెన్నైలోని ఓ దేవాలయంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
'మూకుత్తి అమ్మన్ 2' విషయానికొస్తే.. 2020లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘మూకుత్తి అమ్మన్' సినిమాకు సీక్వెల్ ఇది. ‘మూకుత్తి అమ్మన్' చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్‌ని సుందర్.సి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో అమ్మన్ క్యారెక్టర్‌లో నటించడానికి నయనతార నెల రోజులకు పైగా ఉపవాసం ఉండి నటిస్తున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ ఆది మ్యూజిక్ డైరెక్టర్.