15 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్‌- శోభన సినిమా (ట్రైలర్‌) | Mohanlal Thudarum Telugu Trailer Out Now | Sakshi
Sakshi News home page

మోహన్‌లాల్‌- శోభన కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో ఊహించలేరు

Apr 22 2025 12:27 PM | Updated on Apr 22 2025 12:48 PM

Mohanlal Thudarum Telugu Trailer Out Now

మోహన్‌లాల్(Mohanlal), శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘తుడరుమ్‌’(Thudarum) తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో ఎమ్‌. రంజిత్‌ ఈ క్రైమ్‌ డ్రామా మూవీని నిర్మించారు. 1987లో తొలిసారి నాడోడిక్కట్టు చిత్రంలో కనిపించిన వీరిద్దరూ ఆ సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత సుమారు 56  సినిమాల్లో కలిసి నటించారు. వారిద్దరూ కలిసి అన్ని సినిమాల్లో నటించారంటే ఎవరూ ఊహించలేరని చెప్పవచ్చు.

2009లో చివరిగా 'సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్' చిత్రంలో వారు జంటగా కనిపించారు. మలయాళంలో హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు కలిసి మళ్లీ సుమారు 15 ఏళ్ల తర్వాత 'తుడరుమ్‌' మూవీలో నటించారు. అందుకే మలయాళ అభిమానులు ఈ మూవీ కోసం భారీగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్‌గా మోహన్‌లాల్‌ కనిపిస్తారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement