Modern Love Chennai: మోడ్రన్‌ లవ్‌ చెన్నై.. అప్పుడే స్ట్రీమింగ్‌ కానున్న వెబ్‌ సిరీస్‌

Modern Love Chennai Streaming Date is Here - Sakshi

మోడ్రన్‌ లవ్‌ చైన్నె అనే అంథాలజీ వెబ్‌ సీరీస్‌ ఈనెల 18వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. టైలర్‌ డర్డన్‌ అండ్‌ కినోఫీస్ట్‌ సంస్థ నిర్మించిన ఈ వెబ్‌ సీరీస్‌కు త్యాగరాజన్‌ కుమారరాజా నిర్వహణ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఒక ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు మొత్తం ఆరు ఎపిసోడ్‌లుగా రూపొందిన దీనికి దర్శకుడు భారతీరాజా, బాలాజీ శక్తివేల్‌, రాజుమురుగన్‌, అక్షయ్‌ సుందర్‌, కృష్ణకుమార్‌, రామ్‌కుమార్‌ ఆరుగురు దర్శకులు ఒక్కో ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు.

ఆంగ్లంలో మోడ్రన్‌ లవ్‌ పేరుతో రూపొంది విశేష ప్రేక్షకాదరణను పొందిన ఈ అంథాలజీ వెబ్‌ సీరీస్‌ను మోడ్రన్‌ లవ్‌ చైన్నె పేరుతో రీమేక్‌ చేయడం విశేషం. ఇది ప్రేమను వివిధ కోణాల్లో ఆవిష్కరించే వెబ్‌ సీరీస్‌ అని నిర్వాహకుడు, దర్శకుడు త్యాగరాజన్‌ కుమారరాజా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ తాను సంప్రదాయం కలిగిన వ్యక్తినన్నారు.

50 ఏళ్లుగా పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చానని, సరికొత్త ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించాలన్న తన ఆసక్తి దర్శకుడు త్యాగరాజన్‌ కుమార్‌రాజా ద్వారా ఈ అంథాలజి వెబ్‌ సీరీస్‌తో నెరవేరిందని పేర్కొన్నారు. ప్రేమలేని జీవితం ఉండదన్నారు. జీవితంలో ప్రేమలో పడని వాడు కళాకారుడు కాలేడని అన్నారు. ప్రేమకు ఫిదా సినిమా అంటూ ఉండదని, ప్రేమ చాలా గొప్పదని పేర్కొన్నారు.

చదవండి: అప్‌కమింగ్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలివే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top