Zee5 Announced First Telugu Spy Series Mission Tashaffi, Deets Inside - Sakshi
Sakshi News home page

Mission Tashaffi: ప్రవీణ్‌ సత్తారు స్పై థ్రిల్ల‌ర్‌ మూవీ ప్రత్యేకతలు ఇవే

Jun 19 2023 10:21 AM | Updated on Jun 19 2023 11:54 AM

Mission Tashaffi Zee5 Announces First Telugu Spy Series - Sakshi

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ 5. ఇప్పుడు స‌రికొత్త యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్‌తో ఆక‌ట్టుకోవ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.

సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌ త‌దిత‌రులు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించ‌బోయే న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభ‌మైందని మేకర్స్‌ తెలిపారు. 

(ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్‌,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్‌ మాస్టర్‌)

8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను  ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ‌ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించని స‌రికొత్త లొకేష‌న్స్‌లో ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు. 

(ఇదీ చదవండి: వైరల్‌ అవుతున్న హీరోయిన్‌ లిప్‌లాక్‌ వీడియో)

Advertisement
 
Advertisement
Advertisement