Waltair Veerayya Trailer: బాక్సులు బద్ధలైపోతాయని చిరంజీవికి రవితేజ వార్నింగ్‌

Megastar Chiranjeevi Waltair Veerayya Trailer Out Now - Sakshi

వాల్తేరు వీరయ్య.. టైటిల్‌కు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌, సాంగ్స్‌ కూడా ఊరమాస్‌ లెవల్‌లో ఉన్నాయి. బాస్‌ మాస్‌ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌ ఎగిరి గంతేస్తున్నారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్‌ శనివారం సాయంత్రం రిలీజైంది. 'మీ కథలోకి నేను రాలా.. నా కథలోకి మీరందరూ వచ్చారు', 'వీడు నా ఎర.. నువ్వే నా సొర' అంటూ మాస్‌ డైలాగులు పలికాడు చిరంజీవి. చివర్లో రికార్డుల్లో నా పేరుండటం కాదు నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయని అదిరిపోయే డైలాగ్‌ వేశాడు చిరు.

తర్వాత వైజాగ్‌లో గట్టి వేటగాడు లేడని ఒక పులి పూనకాలతో ఊగుతుందట అంటూ రవితేజ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డ్రగ్‌ స్మగ్లర్‌గా నటించిన చిరును ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోమని చెప్తూ.. ఒక్కొక్కడికి బాక్సులు బద్ధలైపోతాయని వార్నింగ్‌ ఇచ్చాడు మాస్‌ మహారాజ. మొత్తానికి ట్రైలర్‌ మాత్రం అన్ని ఎలిమెంట్స్‌తో అదిరిపోయింది. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటించగా రవితేజ ముఖ్య పాత్ర పోషించాడు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

చదవండి: అలర్జీ.. అందుకే దుస్తుల్లేకుండా కనిపిస్తా

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top