'అయితే ఏటంటావ్ ఇప్పుడు'.. అభిమానికి మెగాస్టార్ అదిరిపోయే రిప్లై! | Megastar Chiranjeevi Teased A fan At Zebra Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: 'ఈ బొమ్మను వైజాగ్‌లో ఆడించాలి మరి'.. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్!

Nov 13 2024 5:15 PM | Updated on Nov 13 2024 6:13 PM

Megastar Chiranjeevi Teased A fan At Zebra Movie Pre Release Event

చిరంజీవి గాడ్ ఫాదర్‌ మూవీలో విలనిజంతో మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాలసుందరం, దినేష్‌ సుందరం ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యం అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమానిని మెగాస్టార్ ఆటపట్టించారు. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్‌ మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో మనం ఓ లుక్కేద్దాం పదండి.

చిరంజీవి వేదికపై మాట్లాతుండగా ఓ అభిమాని గట్టిగా అరిచాడు. మిమ్మల్ని చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చానని అతను చెప్పాడు. దీనికి చిరు వెంటనే 'అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి.. భలేవాడివే.. మన హీరోలు కూడా అదే ఊరే.. కూసో కూసో రా కాసేపు' అంటూ వైజాగ్‌ యాసలోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మెగాస్టార్. ఇది చూసిన నెటిజన్స్‌ మీరు టైమింగ్ సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ టైమింగ్‌లోనూ మీరు మెగాస్టార్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ  చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్‌ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతమందించారు.

Advertisement
 
Advertisement
Advertisement