Megastar Chiranjeevi Waltair Veerayya Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Waltair Veerayya Release Date: సంక్రాంతికి థియేటర్లలో వాల్తేరు వీరయ్య.. రిలీజ్ డేట్ ఫిక్స్

Dec 7 2022 5:50 PM | Updated on Dec 7 2022 7:59 PM

Megastar Chiranjeevi Movie Waltair Veerayya Release on January 13th - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు.  జనవరి 13 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

'ఈ సంక్రాంతికి థియేటర్లలో మాస్ మూలవిరాట్ దర్శనానికి ఇది సమయం' అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి సైతం సంక్రాంతికి కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్ర దర్శకుడు బాబీ 'జనవరి 13న మూలవిరాట్ ఆగమనం' అంటూ ట్వీట్ చేశారు. అధికారిక ప్రకటన రావడంతో మెగాస్టార్ సంక్రాంతి బరిలో నిలిచారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement