Allu Studios Launch: అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి

Megastar Chiranjeevi Launched Allu Studies At Gandipet - Sakshi

అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి  అల్లు స్టూడియోని ప్రారంభించారు. గండిపేటలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు.  అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు అల్లు ఫ్యామిలీ పాల్గొంది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారికి నా నివాళి.. ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఘనత, అప్యాయత లభిస్తుంది. రామలింగయ్య గారి బాటలో అరవింద్, బన్నీ శిరీష్ ,బాబి విజయవంతంగా కొనసాగుతున్నారు. నాడు నటుడిగా ఎదగాలని రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్ద గా అల్లు కుటుంబం ఎదిగింది. అరవింద్ అగ్ర నిర్మాతగా , మనవలకు స్టార్డమ్ దక్కింది. అల్లు స్టూడియో లాభాలను తీసుకురావాలి. ఇది అల్లు వారికి  కృతజ్ఞత , గుర్తింపు గా ఉండాలని నిర్మించినట్లుంది. అల్లు ఫ్యామిలీ లో భాగం అవ్వటం  నాకు ఆనందంగా ఉంది’ అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘ మా నాన్నగారు చనిపోయి 18 ఏళ్లయింది. అనేక మధ్యమల్లో ఇప్పటికీ ఆయన కన్పిస్తున్నారు.స్టూడియో అనేది ఓ జ్ఞాపిక.. లాభాపేక్ష కోసం కట్టింది  కాదు. గీతా ఆర్ట్స్ , అల్లు స్టూడియో , ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నాను’ అన్నారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘అల్లు స్టూడియోస్ ను ఆవిష్కరించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. మా తాతగారి శత జయంతి ఓ ప్రత్యేక మైన రోజు. స్టూడియో అనేది లాభాపేక్ష కోసం పెట్టలేదు. తాతగారి కోరిక, వారి జ్ఞాపకంగా స్టూడియో పెట్టాం. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే తాతాగారికి ఆనందంగా ఉంటుంది. తాతగారు చనిపోయి18 ఏళ్లయినా, మా నాన్న గారికి వారిపై ప్రేమ పెరుగుతోంది. నాపై అభిమానాన్ని చూపిస్తున్న మెగాభిమానులకు, నా ఆర్మీ కి ధన్యవాదాలు’ అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top