-
Allu Studios Launch Photos: అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి (ఫొటోలు)
-
అల్లు స్టూడియోను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి
-
అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి
అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు స్టూడియోని ప్రారంభించారు. గండిపేటలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు ఫ్యామిలీ పాల్గొంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారికి నా నివాళి.. ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఘనత, అప్యాయత లభిస్తుంది. రామలింగయ్య గారి బాటలో అరవింద్, బన్నీ శిరీష్ ,బాబి విజయవంతంగా కొనసాగుతున్నారు. నాడు నటుడిగా ఎదగాలని రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్ద గా అల్లు కుటుంబం ఎదిగింది. అరవింద్ అగ్ర నిర్మాతగా , మనవలకు స్టార్డమ్ దక్కింది. అల్లు స్టూడియో లాభాలను తీసుకురావాలి. ఇది అల్లు వారికి కృతజ్ఞత , గుర్తింపు గా ఉండాలని నిర్మించినట్లుంది. అల్లు ఫ్యామిలీ లో భాగం అవ్వటం నాకు ఆనందంగా ఉంది’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘ మా నాన్నగారు చనిపోయి 18 ఏళ్లయింది. అనేక మధ్యమల్లో ఇప్పటికీ ఆయన కన్పిస్తున్నారు.స్టూడియో అనేది ఓ జ్ఞాపిక.. లాభాపేక్ష కోసం కట్టింది కాదు. గీతా ఆర్ట్స్ , అల్లు స్టూడియో , ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నాను’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘అల్లు స్టూడియోస్ ను ఆవిష్కరించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. మా తాతగారి శత జయంతి ఓ ప్రత్యేక మైన రోజు. స్టూడియో అనేది లాభాపేక్ష కోసం పెట్టలేదు. తాతగారి కోరిక, వారి జ్ఞాపకంగా స్టూడియో పెట్టాం. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే తాతాగారికి ఆనందంగా ఉంటుంది. తాతగారు చనిపోయి18 ఏళ్లయినా, మా నాన్న గారికి వారిపై ప్రేమ పెరుగుతోంది. నాపై అభిమానాన్ని చూపిస్తున్న మెగాభిమానులకు, నా ఆర్మీ కి ధన్యవాదాలు’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement