ఫ్యామిలీతో చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. వీడియో | Megastar Chiranjeevi Celebrated His Birthday With Family Members | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీతో చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. వీడియో

Aug 23 2020 11:21 AM | Updated on Aug 23 2020 11:32 AM

Megastar Chiranjeevi Celebrated His Birthday With Family Members - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి శనివారం తన 65వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కరోనా నేపథ్యంలో బహిరంగంగా వేడుకలు నిర్వహించనప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరోకి మెగా ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొంత మంది ఫ్యాన్స్‌ రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాగ‌బాబు, అల్లు అర‌వింద్ , కొంద‌రు మెగా ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో కేక్ క‌ట్ చేసి మెగాస్టార్ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్నారు.
(చదవండి : అన్నయ్య చేయిపట్టి పెరిగాను.. పవన్‌ భావోద్వేగం)

ఇక చిరు బర్త్‌డేని పురస్కరించుకొని ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ఫస్ట్‌ లుక్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. కరోనా వలన ఈ సారి చిరు బర్త్‌డే వేడుకలు నిరాడంబరంగా జరిపారు. ఈ సారి తన బర్త్‌డే రోజే వినాయక చవితి కూడా రావడంతో చిరంజీవి రెండింటిని తన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. చిరు బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.(చదవండి : చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్‌ ట్వీట్‌)

Advertisement
 
Advertisement
Advertisement