Chiranjeevi Special Birthday Wishes To Krishnam Raju, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Krishnam Raju Birthday: రెబ‌ల్ స్టార్‌కు మెగాస్టార్ బ‌ర్త్‌డే విషెస్‌

Jan 20 2022 4:44 PM | Updated on Jan 20 2022 7:39 PM

Megastar Chiranjeevi Birthday Wishes To Krishnam Raju - Sakshi

సోద‌ర స‌మానుడు, తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు తొలి రెబెల్ స్టార్‌, నిర్మాత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా, కేంద్ర‌మంత్రిగా అడుగు పెట్టిన ప్ర‌తి రంగంలో త‌న‌దంటూ..

క‌థానాయ‌కుడుగా, ప్ర‌తినాయ‌కుడుగా, స‌హాయ‌న‌టుడిగా ఎన్నో సినిమాల్లో మెప్పించాడు రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు. గురువారం(జ‌న‌వ‌రి 20న‌) ఆయ‌న 81వ‌ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు.

'సోద‌ర స‌మానుడు, తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు తొలి రెబెల్ స్టార్‌, నిర్మాత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా, కేంద్ర‌మంత్రిగా అడుగు పెట్టిన ప్ర‌తి రంగంలో త‌న‌దంటూ ప్ర‌త్యేక ముద్ర వేసిన కృష్ణం రాజుగారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు నిండునూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఆహ్లాదంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. కాగా కృష్ణం రాజు ఇటీవ‌ల 'రాధేశ్యామ్' సినిమాలో న‌టించాడు.

Advertisement
 
Advertisement
Advertisement