మెగా ఫాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అక్కడ కూడా రిలీజ్‌ కానున్న 'ఆచార్య'! | Megastar Chiranjeevi And Ram Charan Movie Acharya Releasing in Hindi | Sakshi
Sakshi News home page

మెగా ఫాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అక్కడ కూడా రిలీజ్‌ కానున్న 'ఆచార్య'!

Feb 17 2022 12:41 AM | Updated on Feb 17 2022 1:00 AM

Megastar Chiranjeevi And Ram Charan Movie Acharya Releasing in Hindi - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్‌ 29న రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక వరుసగా తెలుగు చిత్రాలు బాలీవుడ్‌లో విజయం సాదిస్తుండటంతో ‘ఆచార్య’ను కూడా హిందీలో రిలీజ్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక తాజా సమాచారం ఏంటంటే ఈ చిత్రం హిందీలోనూ డబ్‌ చేసి విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయాన్ని హిందీలో పంపిణీ చేయనున్న 'పెన్‌ స్టూడియోస్‌' సంస్థ తెలిపింది. అయితే ఈ సంస్థ నుంచి పలు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

గత శుక్రవారం రవితేజ నటించిన 'ఖిలాడి' చిత్రాన్ని కూడా డబ్‌ చేసి 'పెన్‌ స్టూడియోస్‌' హిందీలో రిలీజ్‌ చేసింది. ఇక వీటితో పాటు వారి స్ట్రయిట్‌ బాలీవుడ్‌ సినిమా 'గంగూభాయి కతియావాడి' ఈ నెల 25న రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇక 'ఆర్​ఆర్​ఆర్' మార్చి 25న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక వీటితో పాటు 'అటాక్‌ పార్ట్‌ 1' జెర్సీ హిందీ రిమేక్‌ వంటి చిత్రాలు పెన్‌ స్టూడియోస్‌ నుంచి వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలానే ‘ఆచార్య’ హిందీ వర్షెన్‌ను కూడా ఏప్రిల్‌ 29న విడుదల చేయబోతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఇక దీంతో మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement