ఆ హీరోతో నటించే ఛాన్స్‌ వస్తే అదృష్టవంతులే: మీనాక్షి చౌదరి | Meenakshi Chaudhary Interesting Comments On Movie Chance With Thalapathy Vijay, Deets Inside - Sakshi
Sakshi News home page

Meenakshi Chaudhary: ఆ హీరోతో నటించే ఛాన్స్‌ వస్తే అదృష్టవంతులే

Published Mon, Jan 29 2024 7:14 AM

Meenakshi Chodary Comments On Vijay - Sakshi

టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షిచౌదరి కోలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగులో మహేష్‌బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుని మరింత పాపులర్‌ అయింది. పొంగల్‌ రేసులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్నా తర్వాత పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. రూ. 250 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

 తమిళంలో ఈమె ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి విజయ్‌కు జంటగా నటిస్తున్నది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైం. నటి స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా, మోహన్‌, జయరాం, యోగిబాబు, అజ్మల్‌, అమీర్‌, వైభవ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో విజయ్‌ సరసన నటించే అవకాశం రావడం గురించి మీనాక్షి చౌదరి తన ఆనందాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

విజయ్‌ సరసన నటిస్తున్నట్లు తెలియగానే ఆనందంతో తనగుండె ఆగిపోయేలా అనిపించిందన్నారు. విజయ్‌ జంటగా నటించే అవకాశం ఎవరికీ అంత సులభంగా రాదన్నారు. అలాంటి అవకాశం లభిస్తే వారు అదృష్టవంతులేనని పేర్కొన్నారు. అలాంటి అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. అయితే షూటింగ్‌ స్పాట్లో విజయ్‌ తనతో ప్రవర్తించిన విధానం మాటల్లో వర్ణించలేనన్నారు. తాను ఆయన వీరాభిమానిని అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ బ్యూటీ తమిళంలో ఆర్‌జే బాలాజి సరసన నటించిన సింగపూర్‌ సెలూన్‌ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement