కథని నమ్మి చేశారనిపిస్తోంది | Sakshi
Sakshi News home page

కథని నమ్మి చేశారనిపిస్తోంది

Published Thu, Feb 22 2024 12:53 AM

Masthu Shades Unnai Ra Pre-Release Event - Sakshi

‘‘విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అభినవ్‌ ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’ చిత్రంలో తొలిసారి హీరోగా చేశాడు. ఈ చిత్రంతో తనకు మంచి సక్సెస్‌ రావాలి. టీజర్, ట్రైలర్‌ చూస్తే కథని నమ్మి చేసిన సినిమాలా అనిపిస్తోంది. టీమ్‌ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం విజయం సాధించి, దర్శక, నిర్మాతలకు మంచి బ్రేక్‌ రావాలని ఆశిస్తున్నాను’’ అని హీరో వరుణ్‌ తేజ్‌ అన్నారు. అభినవ్‌ గోమఠం, వైశాలి రాజ్‌ జంటగా తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’.

కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌పై భవాని కాసుల, ఆరెం రెడ్డి, ప్రశాంత్‌.వి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకు వరుణ్‌ తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరై, మూవీ బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. అభినవ్‌ గోమఠం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నా కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా ఈ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు తొలి అవకాశం ఇచ్చిన అభినవ్‌కు, నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు తిరుపతి రావు. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు భవాని కాసుల.

Advertisement
 
Advertisement
 
Advertisement