మాస్‌ మహారాజా బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. రావణాసుర ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది | Mass Maharaja Ravi Teja First Glimpse Release From Ravanasura Movie | Sakshi
Sakshi News home page

Ravi Teja Ravanasura First Glimpse: మాస్‌ మహారాజా బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. రావణాసుర ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది

Jan 26 2023 3:04 PM | Updated on Jan 26 2023 3:59 PM

Mass Maharaja Ravi Teja First Glimpse Release From Ravanasura Movie - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ పుట్టిన నేడు. జనవరి 26 ఆయన బర్త్‌డే సందర్భంగా మాస్‌ మాహారాజా తదుపరి చిత్రం రావణాసుర నుంచి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ వదిలారు మేకర్స్‌. రవితేజ నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు మంచి విజయం సాధించాయి. అదే జోష్‌లో తన తదుపరి చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు సుధీర్‌ వర్మతో  రావణాసుర మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ బర్త్‌డే కానుకగా ఈ రోజు రావణాసుర మూవీ తాజా పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.  వీడియో చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

చదవండి: కాబోయే భార్యను పరిచయం చేసిన శర్వానంద్‌.. ఫోటోలు వైరల్‌

ఓ భవంతిలో యువతిని చంపగా.. బ్లాక్ సూట్‌ ధరించిన రవితేజ లోపలి నుంచి బయటకు వచ్చి సిగార్ వెలిగించి వీడియో ఆసక్తికరంగా ఉంది. సుశాంత్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ నటిస్తున్నారు. రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, నితిన్‌ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement