మంజుమ్మల్‌ బాయ్స్‌ని ఎంజాయ్‌ చేస్తారు | Manjummel Boys Movie Pre Release Event At Hyderabad, Deets Inside - Sakshi
Sakshi News home page

మంజుమ్మల్‌ బాయ్స్‌ని ఎంజాయ్‌ చేస్తారు

Apr 5 2024 4:41 AM | Updated on Apr 5 2024 11:58 AM

Manjummel Boys pre release event at hyderabad - Sakshi

‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ఈవెంట్‌లో ఓ దృశ్యం

– నిర్మాత నవీన్‌ యెర్నేని

‘‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ సినిమాని అమెరికాలో చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్‌ మూవీ ఇది. మలయాళంలో బిగ్‌ హిట్‌ అవడంతో పాటు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్స్‌కి వచ్చి చూడండి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అని నిర్మాత నవీన్‌ యెర్నేని అన్నారు. సౌబిన్‌ షాహిర్, గణపతి, ఖలీద్‌ రెహమాన్, శ్రీనాథ్‌ భాసి ప్రధాన పాత్రల్లో చిదంబరం ఎస్‌. పొదువల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’.

పరవ ఫిలింస్‌పై బాబు షాహిర్, సౌబిన్, షాహిర్, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో తెలుగులో ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో చిదంబరం ఎస్‌. పొదువల్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు వివేక్‌ కూచిభొట్ల, శశిధర్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, నటులు శ్రీనాథ్‌ భాసి, అరుణ్‌ కురియన్, విష్ణు రవి తదితరులు మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement