Fukrey Actor Manjot Singh Recalls Being Jobless For 2 Years And Says It’s Not Easy - Sakshi
Sakshi News home page

Manjot Singh: రెండేళ్లు ఇంట్లో ఖాళీగా.. అదంత ఈజీ కాదు

Jul 21 2021 9:04 AM | Updated on Oct 17 2021 2:01 PM

Manjot Singh Recalls Being Jobless, Its Not Easy - Sakshi

నేను 16 ఏళ్లకే నటించడం మొదలు పెట్టాను. ఆ ఏజ్‌లో చాలా సినిమాలు చేశాను. కానీ ఫర్కీ సినిమా తర్వాత రెండేళ్ల పాటు ఏ సినిమా చేయలేదు...

Manjot Singh: యంగ్‌ ఏజ్‌లోనే ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్‌ నటుడు మంజోత్‌ సింగ్‌. కానీ తన లైఫ్‌లోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని, అవకాశాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశానంటున్నాడు. 2013లో వచ్చిన 'లాలి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు 2017లో దానికి సీక్వెల్‌గా వచ్చిన 'ఫర్కీ రిటర్న్స్‌'లోనూ నటించాడు. వీటితోపాటు 'ఓయ్‌ లక్కీ, లక్కీ ఓయ్‌' సినిమాలోనూ మెరిశాడు. అయితే ఓ రెండేళ్లపాటు ఉపాధి లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చిందంటున్నాడీ యాక్టర్‌.

తాజాగా మంజోత్‌ సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను 16 ఏళ్లకే నటించడం మొదలు పెట్టాను. ఆ ఏజ్‌లో చాలా సినిమాలు చేశాను. కానీ ఫర్కీ సినిమా తర్వాత రెండేళ్ల పాటు ఏ సినిమా చేయలేదు. నాకు వచ్చిన ఆఫర్లేమో నచ్చలేదు, కోరుకున్నవేమో నా దగ్గరికి రాలేదు.  ఆ ఫేజ్‌ నాకంత ఈజీగా అనిపించలేదు. ఇంట్లో కూర్చుని చదువుకునే సమయంలో సినిమాలు చేస్తూ బాగా సంపాదించినప్పుడు జీవితం ఎంత బాగుందో అనుకున్నా. కానీ నేను కూడా ఆఫర్‌ కోసం వెయట్‌ చేశాను. ఇలా సరైన అవకాశం కోసం నిరీక్షించాల్సి వచ్చినప్పుడు మనకు మనం రియాలిటీ చెక్‌ చేసుకోవాల్సిందే' అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement