మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫోటోలు | Mani Sharma Son Sagar Mahati Engagement Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Mani Sharma: వైరలవుతోన్న మణిశర్మ కుమారుడి నిశ్చితార్థపు ఫోటోలు

Oct 11 2021 6:14 PM | Updated on Oct 11 2021 7:49 PM

Mani Sharma Son Sagar Mahati Engagement Photos Goes Viral - Sakshi

Young Music director Mahati Swara Sagar Gets Engaged

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు స్వరసాగర్‌ మహతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. సంజన కలమంజే అనే యువతితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ వేడుక అత్యంత సాధారణంగా జరిగింది. అయితే సాగర్‌ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేవరకు ఈ విషయం ఎక్కవ మందికి తెలియదు.


చదవండి: కొత్త ఫ్లాట్‌ తీసుకున్న చై, అక్కడే ఒంటరిగా..

ఇక సాగర్‌ మహతి పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా గాయని కావడం విశేషం. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. అంతేగాక సాగర్‌ మ్యూజిక్‌ డైరెక్ట్‌ చేసిన భీష్మ సినిమాలోని ‘హేయ్‌ చూసా’ అనే పాటకు గాత్రం అందించారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చదవండి: ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌

అయితే సాగర్‌- సంజనల పెళ్లి తేదిని ఇంకా ఖరారు చేయనట్లు తెలుస్తోంది. కాగా మణిశర్మ కుమారుడు సాగర్ మహతి కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన ‘ఛలో, భీష్మ, మ్యాస్ట్రో’ వంటి చిత్రాలకు సంగీతం అందించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాగే తన తండ్రి పని చేసే చిత్రాలకు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement