ఓటీటీలోకి 'మంగళవారం' థ్రిల్లర్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..? | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి 'మంగళవారం' థ్రిల్లర్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Published Tue, Dec 12 2023 12:19 PM

Mangalavaaram Movie Streaming On Disney Plus Hotstar - Sakshi

పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా 'మంగళవారం'.  మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 17న విడుదలైంది. 'ఆర్‌ఎక్స్‌ 100' లాంటి విజయం తర్వాత హీరోయిన్‌  పాయల్‌ రాజ్‌పూత్‌, డైరెక్టర్‌ అజయ్ భూపతి కాంబినేషన్‌లో ఈ సినిమా వచ్చింది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న మంగళవారం చిత్రం ఓటీటీలోకి విడుదల అయ్యేందకు రెడీగా ఉంది.  ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది.  క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 26న మంగళవారం  రోజునే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పోస్టర్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కానీ ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

థ్రిల్లర్ కాన్సెప్టెతో  తెరకెక్కిన ఈ సినిమాలో   పాయల్‌ రాజ్‌పూత్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమా మాదిరే ఇందులో కూడా అదే రేంజులో అందాలను ఆరబోసింది పాయల్‌. ఇందులో ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవుతారు.. అంతలా ఈ సినిమా కోసం ఆమె గ్రౌండ్‌ వర్క్‌ చేసిందని చెప్పవచ్చు. సినిమా ప్రారంభంలో కథలో ట్విస్ట్‌లు ఇస్తూ వెళ్లిన దర్శకుడు సెకండాఫ్‌లో ఒక్కొక్కటి రవీల్‌ చేసిన విధానానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. సినిమా చివరి 45 నిమిషాల్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. 'కాంతార'కు అజనీష్‌ అందించిన మ్యూజిక్‌ మంగళవారం సినిమాకు బాగా ప్లస్‌ అయింది.  ముఖ్యంగా 'గణగణ మోగాలి' పాటకు ఆయన అందించిన మ్యూజిక్‌తో  పూనకాలు వచ్చేస్తాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement