Mandana Karimi Reaction On The Name Of The Filmmaker Who Cheated On Her - Sakshi
Sakshi News home page

Mandana Karimi: నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్‌ కాదు!

Apr 21 2022 12:44 PM | Updated on Apr 21 2022 1:12 PM

Mandana Karimi Reaction On The Name Of The Filmmaker Who Cheated On Her - Sakshi

భర్త నుంచి విడిపోయాక బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడితో నాకు పరిచయం ఏర్పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశి తీరా ముఖం చాటేశాడని షోలో వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్‌ మరెవరో కాదు అనురాగ్‌ కశ్యప్‌ అంటూ జోరుగా ప్రచారం..

సెలబ్రిటీల సీక్రెట్లు బయటపెడుతూ సంచలనాలు సృష్టిస్తోంది లాకప్‌ షో. కంగనా రనౌత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న లాకప్‌ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్‌ అయింది నటి మందనా కరిమి. అయితే షోలో ఉన్న సమయంలో తన గురించి ఓ సీక్రెట్‌ను బయటపెట్టిందామె. భర్త నుంచి విడిపోయాక బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడితో నాకు పరిచయం ఏర్పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశి తీరా ముఖం చాటేశాడని షోలో వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్‌ పేరు మాత్రం చెప్పలేదు.

కానీ సోషల్‌ మీడియాలో మాత్రం అతడు మరెవరో కాదు అనురాగ్‌ కశ్యప్‌ అంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. తాజాగా దీనిపై మందనా స్పందించింది. అనురాగ్‌ నా స్నేహితుడు, ఇప్పటికీ మేము మంచి మిత్రులం. వార్తల్లో అతడి పేరు చూసి షాకయ్యాను. ఇది అనైతికం. అనవసరంగా అతడి పేరు ప్రచారం చేసి వార్తలు సృష్టిస్తున్నారు.

షోలో నేను చెప్పింది నిజమే. కానీ దానికి మసాలా యాడ్‌ చేస్తున్నారు. మాటలు మారుస్తున్నారు. నేను చెప్పని పేర్లను వార్తల్లో చొప్పిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు నోటికొచ్చిన పేరు చెప్పి వారి జీవితాలతో చెలగాటమాడతారా? ఇది నిజంగా బాధాకరం. మరోసారి చెప్తున్నా, నేను సహజీవనం చేసింది నా స్నేహితుడితో కాదు అని అసత్య ప్రచారంపై మండిపడింది మందనా.

చదవండి: నోటి దురుసుతో వార్తల్లోకి, ఆపై సారీ చెప్పిన నటుడు

 అక్షయ్‌పై ట్రోలింగ్‌, మెట్టు దిగి సారీ చెప్పిన హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement