Manchu Mohan Babu About Son Manchu Vishnu At Ginna Movie Pre Release Event - Sakshi
Sakshi News home page

Manchu Mohan Babu: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా

Oct 17 2022 1:34 PM | Updated on Oct 17 2022 3:41 PM

Manchu Mohan Babu About Son Manchu Vishnu At Ginna Movie Event - Sakshi

తన తనయుడు, హీరో మంచు విష్ణు అన్న మాటలకు తాను షాకయ్యానన్నాడు నటుడు మంచు మోహన్‌ బాబు. ఆదివారం జరిగిన జిన్నా మూవీ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్ల తన నటన జీవితంలో తనని ఎవరు ఇలా అనలేదన్నాడు. ‘నేను దాదాపు 560 చిత్రాల్లో నటించా, 75 సినిమాలు నిర్మించా.

మా అన్నగారు ఎన్టీఆర్‌ మూవీ ఫంక్షన్‌ల్లో కానీ, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, కృష్ణంరాజు గారి సినిమా ఫంక్షన్లలో ఇన్ని నిమిషాలే మాట్లాడాలని నాకెవరు చెప్పలేదు. కానీ విష్ణు నాకు చెప్పాడు. ఎంతసేపు మాట్లాడాలనేది అంత పెద్దవాళ్లే నాతో ఎప్పుడూ చెప్పలేదు. కానీ విష్ణు అలా అనడంతో షాకయ్యా. అంటే నేను వేదికపై ఎక్కువగా మాట్లాడతానా? అనిపించింది’ అని మోహన్‌ బాబు అన్నాడు.
చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే

అనంతరం జిన్నా కోసం విష్ణు చాలా కష్టపడ్డాడని, ఏ సినిమాకు చేయని రిస్క్‌ షాట్స్‌ ఈ చిత్రంలో చేశాడంటూ తనయుడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నిలియోన్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 21న విడుదల కాబోతోంది. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో రుపొందిన ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతం అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement