మంచు మనోజ్ కొత్త ప్రయాణం ప్రారంభించారు. ‘మోహన రాగ’ పేరుతో ఓ మ్యూజిక్ సంస్థని ఆరంభించారాయన. ‘లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్’ అనే క్యాప్షన్‌తో మన సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఈ మ్యూజిక్ లేబుల్‌తో తనదైన ప్రయత్నం చేయనున్నారాయన.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘‘సంగీతం మీద నాకు ఉన్న ప్రేమే ‘మోహన రాగ’ మ్యూజిక్ లేబుల్ స్థాపించే స్ఫూర్తిని ఇచ్చింది. ఫ్రెష్ సౌండ్స్, బోల్డ్ టాలెంట్, ఫియర్‌లెస్ క్రియేటివిటీని మా మ్యూజిక్ లేబుల్ ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తాం’’ అన్నారు మనోజ్.


