రాజ్‌ తరుణ్‌తో ఎఫైర్‌పై స్పందించిన మాల్వి మల్హోత్రా | Malvi Malhotra First Reaction On Raj Tarun Issue | Sakshi
Sakshi News home page

లావణ్య ఎవరో నాకు తెలియదు.. టార్చర్‌ చూపిస్తోంది: మాల్వి మల్హోత్రా

Jul 6 2024 4:58 PM | Updated on Jul 6 2024 5:16 PM

Malvi Malhotra First Reaction On Raj Tarun Issue

ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకాపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హీరో రాజ్‌తరుణ్‌ తనతో సహజీవనం చేస్తూనే మరో పక్క మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా స్పందించింది.

మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. 'రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతీ హీరోయిన్‌ను లావణ్య అనుమానిస్తుంది. ఇప్పటి వరకు ఆమెతో నాకు ఎలాంటి పరిచయం లేదు. నేను తనను బెదిరించలేదు. లావణ్యనే ప్రతిరోజూ నాకు మెసేజ్‌లు, కాల్స్‌ చేస్తూ టార్చర్‌ చేస్తోంది. రాజ్‌ తరుణ్‌ నా సహ నటుడు మాత్రమే. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఆమె చెబుతున్నవన్నీ అబద్దాలే' అని పేర్కొంది.

చదవండి: హీరో రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో ట్విస్ట్‌!

'రాజ్‌తరుణ్‌తో నాకు పెళ్లి అయినట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదు. ఆమె ఇలాంటి కథలు చెబుతుంది. లావణ్య చేస్తున్న టార్చర్‌ భరించలేక ఆమె నంబర్‌ను నేను బ్లాక్‌ చేశాను. ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌తో కూడా చెప్పాను. ఆ సమయంలో ఆమె నా తల్లదండ్రులకు కూడా ఫోన్‌ కాల్స్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చింది. నా కుటుంబ సభ్యులు నంబర్స్‌ రాజ్‌తరుణ్‌ వద్ద కూడా లేవు. ఆమె ఎలా సంపాధించిందో తెలాల్సి ఉంది. ఆమె కాల్స్‌ చేసి భూతులు మాట్లాడుతుంది. తనకు ఎలాంటి సిగ్గులేదు. 

సమస్య వారిద్దరిదీ. కానీ, ఈ గొడవలు నా పేరు ఎందుకు తీస్తుందో తెలియదు. ఆమె టార్చర్‌ భరించలేకనే నేను ఎనిమి నెలలుగా రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేను. సినిమా విడుదల సమయంలో మాత్రమే ఆయనతో మాట్లాడుదానిని. మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. ఇలాంటి రూమర్స్‌ ఇంతటితో ఆపేస్తే మంచిది. ఇప్పుడు నేను కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తా.' అని మాల్వి మల్హోత్రా తెలిపింది. ప్రస్తుతం ఆమె సైబరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement