కల నిజం అయింది | Malayalam actress Femina George joins Raaka Movie | Sakshi
Sakshi News home page

కల నిజం అయింది

Jun 3 2026 4:04 AM | Updated on Jun 3 2026 4:04 AM

Malayalam actress Femina George joins Raaka Movie

‘రాకా’ సినిమాలో భాగం అయ్యారు మలయాళ నటి ఫెమినా జార్జ్‌. హీరో అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో హీరోయిన్  దీపికా పదుకొనె ప్రధాన  పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్లు జాన్వీకపూర్, రష్మికా మందన్నా, మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని టాక్‌. తాజాగా తానూ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫెమినా జార్జ్‌ తెలి పారు.

‘‘హ్యాపీ’ సినిమా చూసినప్పటి నుంచి అల్లు అర్జున్ గారికి పెద్ద అభిమానిని. ఆయన హీరోగా చేస్తున్న ‘రాకా’ చిత్రంలో నేను భాగం అవుతానని అస్సలు ఊహించలేదు. నా కల నిజం అయినట్లుగా ఉంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు నేను చేసిన భారీ సినిమా ఇదే. ఈ చిత్రంలో నా  పాత్ర నిడివి తక్కువే కావొచ్చు.. కానీ, ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఫెమినా జార్జ్‌. మలమాళ హిట్‌ ఫిల్మ్‌ ‘మిన్నల్‌ మురళి’తో ఇండస్ట్రీకి వచ్చిన ఫెమినా ఆ తర్వాత ‘తీ΄్పోరి బెన్నీ’, ‘కరక్కం’ వంటి సినిమాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement