breaking news
Femina
-
కల నిజం అయింది
‘రాకా’ సినిమాలో భాగం అయ్యారు మలయాళ నటి ఫెమినా జార్జ్. హీరో అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్లు జాన్వీకపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని టాక్. తాజాగా తానూ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫెమినా జార్జ్ తెలి పారు.‘‘హ్యాపీ’ సినిమా చూసినప్పటి నుంచి అల్లు అర్జున్ గారికి పెద్ద అభిమానిని. ఆయన హీరోగా చేస్తున్న ‘రాకా’ చిత్రంలో నేను భాగం అవుతానని అస్సలు ఊహించలేదు. నా కల నిజం అయినట్లుగా ఉంది. నా కెరీర్లో ఇప్పటి వరకు నేను చేసిన భారీ సినిమా ఇదే. ఈ చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువే కావొచ్చు.. కానీ, ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఫెమినా జార్జ్. మలమాళ హిట్ ఫిల్మ్ ‘మిన్నల్ మురళి’తో ఇండస్ట్రీకి వచ్చిన ఫెమినా ఆ తర్వాత ‘తీ΄్పోరి బెన్నీ’, ‘కరక్కం’ వంటి సినిమాల్లో నటించారు. -
అల్లు అర్జున్ రాకా.. మలయాళ బ్యూటీకి జాక్‌పాట్...!
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ రాకా. ఇప్పటికే రిలీజైన రాకా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ నెగెటివ్ రోల్ కూడా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో మలయాళ నటి ఫెమినా జార్జ్ నటిస్తున్నారు. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫెమినా.. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. అసలు ‘రాకా’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవుతానని ఊహించలేదని అన్నారు. నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. ఆయన నటించిన హ్యాపి నేను చూసిన మొదటి చిత్రమని వెల్లడించారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం కల నిజమైనట్లుగా ఉందని పేర్కొన్నారు, ఇటీవల డిస్కో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే రాకా టీమ్ నుంచే ఫోన్ వచ్చిందని పంచుకున్నన్నారు. కాగా.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఫెమినా 2021లో నెట్‌ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. -
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)
-
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా నికితా పోర్వాల్
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగినా ఈ ఫెమినా అందాల పోటీలో నికితా విజయకేతనం ఎగురవేసి కిరీటాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా మంచి స్టోరీ టెల్లర్. ఆ అభిరుచికి జీవం పోయాలనే ఉద్దేశ్యంతోనే సుమారు 60కి పైగా నాటకాలలో నటించింది. కృష్ణలీల అనే పేరుతో 250 పేజీల నాటకాన్ని కూడా రాసింది. అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఫీచర్ ఫిల్మ్‌లో నికితా కూడా ఒక భాగం, త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఆమె మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమాని. ఆమె గంభీరమైన వ్యవహారశైలి, తెలివితేటలంటే నికితకు అత్యంత ఇష్టమట. ఆధునికతను స్వీకరించటం తోపాటు భారతీయ వారసత్వానికి కూడా ప్రాధాన్యతి ఇచ్చే వైఖరిలో ఐశ్వర్యకు సాటిలేరని అంటోంది నికితా. ప్రకాశవంతమైన స్త్రీకి ఉదాహారణ ఆమె అంటూ ఐశ్వర్వరాయ్పై ప్రశంసలు కురిపించింది. ఇక నికిత జంతు ప్రేమికురాలు కూడా. మన అభివృద్ధి తోపాటు మనపై ఆధారపడిన జీవుల సంరక్షణ బాధ్యత కూడా మనదే అనేది ఆమె నమ్మకం. ఆశయం వద్దకు వస్తే చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయాలనేది ఆమె కోరిక. అలాగే జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గురించి అడిగినప్పుడు..తానేనంటూ సగర్వంగా చెప్పుకుంది. ఎందుకంటే..వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా వచ్చానా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తనకు తన భవిష్యత్తుని అందంగా రూపుదిద్దుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతుంది. (చదవండి: బీచ్ వెడ్డింగ్, అందమైన లవ్‌స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్) -
ఫెమీనా మెహెందీ పోటీలు
-
ఫెమీనా ఫెస్టివ్ షోకేష్ 2013 అందాలు


