అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ రాకా. ఇప్పటికే రిలీజైన రాకా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ నెగెటివ్ రోల్ కూడా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇందులో మలయాళ నటి ఫెమినా జార్జ్ నటిస్తున్నారు. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫెమినా.. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. అసలు ‘రాకా’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవుతానని ఊహించలేదని అన్నారు. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. ఆయన నటించిన హ్యాపి నేను చూసిన మొదటి చిత్రమని వెల్లడించారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం కల నిజమైనట్లుగా ఉందని పేర్కొన్నారు, ఇటీవల డిస్కో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే రాకా టీమ్ నుంచే ఫోన్ వచ్చిందని పంచుకున్నన్నారు. కాగా.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఫెమినా 2021లో నెట్‌ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.


