
విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్ హీరో హీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’. వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో మాళవికా సతీషన్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు దివ్య. ఎమోషన్, కామెడీ.. ఇలా అన్ని కోణాలను ఈ క్యారెక్టర్‌లో చూపించే అవకాశం లభించింది.
నా రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉండే పాత్ర ఇది. జనరల్‌గా అమ్మాయిల వెంట అబ్బాయిలు పడుతుంటారు. కానీ కథలోని క్యారెక్టర్ రీత్యా ఈ సినిమాలో హీరో వెంట నేను పడుతుంటాను. టైటిల్ బోల్డ్‌గా అనిపిస్తున్నప్పటికీ కథలో మంచి ఎమోషనల్ జర్నీ ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. నిర్మాతలు వేణు, నిరంజన్ రెడ్డిగార్లు ఈ సినిమాకు బ్యాక్ బోన్స్. నిర్మాణంపరంగా ఎక్కడ వారు రాజీ పడలేదు’’ అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ– ‘‘తెలుగు పరిశ్రమ ఎవరినైనా స్వాగతిస్తుంది. అదే ఈ ఇండస్ట్రీ గొప్పదనం. చదువుకుంటున్న కారణంగా సినిమాలు చేసే విషయంలో మొన్నటివరకూ కాస్త స్లోగా ఉన్నాను. ఇప్పుడు చదువు పూర్తయింది. సో.. ఇకపై ఎక్కువ సినిమాలు చేస్తాను. యాక్టర్స్‌లో అడివి శేష్, నాగశౌర్య, అఖిల్‌గార్లంటే ఇష్టం. అలాగే నాకు డిఫెన్స్ ఆఫీసర్‌గా, ఓ స్పోర్ట్స్ డ్రామా, ఓ బయోపిక్, రాజమౌళిగారి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు మాళవికా సతీషన్ అన్నారు.