breaking news
Boy Friend For Hire Movie
-
185 కథలు విన్నాను. కానీ ఏడు సినిమాలే చేశాను : నటుడు
‘‘నేను ఒక్కడినే ఫైట్స్, డ్యాన్స్ చేసే తరహా సినిమాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నాను. కానీ హిందీలో రణ్‌బీర్ కపూర్ చేసిన ‘రాక్‌స్టార్’లాంటి సినిమా వస్తే చేస్తాను. నేనిప్పటి వరకు దాదాపు 185 కథలు విన్నాను. కానీ ఏడు సినిమాలే చేశాను. కేవలం డబ్బే కాదు.. గౌరవప్రదమైన సినిమాలూ చేయాలని అనుకుంటాను’’ అన్నారు విశ్వంత్ దుడ్డుంపూడి. సంతోష్ దర్శకత్వంలో విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్ జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’. వేణువధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ త్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వంత్ మాట్లాడుతూ – ‘‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ మంచి లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ. అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకునే ఓ వ్యక్తి ప్రేమలో ఎలా పడ్డాడు? అతను ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉండాలని అనుకున్నాడు? అన్నదే ఈ సినిమా కథాంశం. ప్రస్తుతం హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్గార్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. చైతన్య దర్శకత్వంలో నేను హీరోగా చేసిన ‘కథ వెనుక కథ’ డిసెంబరులో రిలీజ్ కావొచ్చు. ఇంకా ‘నమో’, ‘కాదల్’, ‘తారాతీరం’ అనే సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
Malavika Satheeshan: ఇక ఎక్కువ సినిమాలు చేస్తా
విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్ హీరో హీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’. వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో మాళవికా సతీషన్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు దివ్య. ఎమోషన్, కామెడీ.. ఇలా అన్ని కోణాలను ఈ క్యారెక్టర్లో చూపించే అవకాశం లభించింది. నా రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉండే పాత్ర ఇది. జనరల్‌గా అమ్మాయిల వెంట అబ్బాయిలు పడుతుంటారు. కానీ కథలోని క్యారెక్టర్ రీత్యా ఈ సినిమాలో హీరో వెంట నేను పడుతుంటాను. టైటిల్ బోల్డ్‌గా అనిపిస్తున్నప్పటికీ కథలో మంచి ఎమోషనల్ జర్నీ ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. నిర్మాతలు వేణు, నిరంజన్ రెడ్డిగార్లు ఈ సినిమాకు బ్యాక్ బోన్స్. నిర్మాణంపరంగా ఎక్కడ వారు రాజీ పడలేదు’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తెలుగు పరిశ్రమ ఎవరినైనా స్వాగతిస్తుంది. అదే ఈ ఇండస్ట్రీ గొప్పదనం. చదువుకుంటున్న కారణంగా సినిమాలు చేసే విషయంలో మొన్నటివరకూ కాస్త స్లోగా ఉన్నాను. ఇప్పుడు చదువు పూర్తయింది. సో.. ఇకపై ఎక్కువ సినిమాలు చేస్తాను. యాక్టర్స్‌లో అడివి శేష్, నాగశౌర్య, అఖిల్గార్లంటే ఇష్టం. అలాగే నాకు డిఫెన్స్ ఆఫీసర్‌గా, ఓ స్పోర్ట్స్ డ్రామా, ఓ బయోపిక్, రాజమౌళిగారి డైరెక్షన్లో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు మాళవికా సతీషన్ అన్నారు. -
అద్దెకు బాయ్ ఫ్రెండ్ దొరికితే..
‘కేరింత’ ‘మనమంతా’ ‘ఓ పిట్టకథ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న చిత్రం బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్(BFH). మాళవిక హీరోయిన్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను యంగ్ హీరో విష్వక్ సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సన్నివేశాలతో రూపొందించారు. బాయ్ ఫ్రెండ్ గనక అద్దెకు దొరికితే ఎలా ఉంటుందనేది సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.