
‘‘నేను ఒక్కడినే ఫైట్స్, డ్యాన్స్ చేసే తరహా సినిమాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నాను. కానీ హిందీలో రణ్‌బీర్ కపూర్ చేసిన ‘రాక్‌స్టార్’లాంటి సినిమా వస్తే చేస్తాను. నేనిప్పటి వరకు దాదాపు 185 కథలు విన్నాను. కానీ ఏడు సినిమాలే చేశాను. కేవలం డబ్బే కాదు.. గౌరవప్రదమైన సినిమాలూ చేయాలని అనుకుంటాను’’ అన్నారు విశ్వంత్ దుడ్డుంపూడి. సంతోష్ దర్శకత్వంలో విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్ జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’.
వేణువధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ త్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వంత్ మాట్లాడుతూ – ‘‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ మంచి లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ. అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకునే ఓ వ్యక్తి ప్రేమలో ఎలా పడ్డాడు? అతను ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉండాలని అనుకున్నాడు? అన్నదే ఈ సినిమా కథాంశం.
ప్రస్తుతం హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్‌గార్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. చైతన్య దర్శకత్వంలో నేను హీరోగా చేసిన ‘కథ వెనుక కథ’ డిసెంబరులో రిలీజ్ కావొచ్చు. ఇంకా ‘నమో’, ‘కాదల్’, ‘తారాతీరం’ అనే సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.