
యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సన్నివేశాలతో రూపొందించారు. బాయ్ ఫ్రెండ్ గనక అద్దెకు దొరికితే ఎలా ఉంటుందనేది
‘కేరింత’ ‘మనమంతా’ ‘ఓ పిట్టకథ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న చిత్రం బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్(BFH). మాళవిక హీరోయిన్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను యంగ్ హీరో విష్వక్ సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సన్నివేశాలతో రూపొందించారు. బాయ్ ఫ్రెండ్ గనక అద్దెకు దొరికితే ఎలా ఉంటుందనేది సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.