ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో! | Malavika Mohanan Face Rude Behaviour By Indigo Airlines, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో!

Published Fri, Jan 5 2024 7:01 AM

Malavika Mohanan Face Rude Behaviour By Indigo Airlines - Sakshi

సామాన్యుల ఎప్పుడూ ఉండేదే కానీ సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు చేదు అనుభవాలను ఎదుర్కొంటుంటారు. అలాంటప్పుడు అందుకు సంబంధించిన వ్యవస్థలపైనో, వ్యక్తులపైనో ఫైర్‌ అవుతుంటారు. తాజాగా యంగ్ హీరోయిన్ మాళవికా మోహన్‌ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. వాటి గురించి తన ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్‌ బైక్‌' రమణ.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌)

వివరాల్లోకి వెళ్తే.. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్. తమిళంలో రజనీకాంత్‌ 'పేట' మూవీలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. దళపతి విజయ్‌ 'మాస్టర్‌'లో, ధనుష్‌ 'మారన్‌'లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్‌' త్వరలో రిలీజ్ కానుంది. అలానే ప్రభాస్-మారుతి కాంబోలో తీస్తున్న మూవీలోనూ ఓ హీరోయిన్‌గా చేస్తోంది. 

తాజాగా చైన్నె విమానాశ్రయంలో ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. తాను జైపూర్‌ నుంచి ఇండిగో విమానంలో చైన్నెకి బుధవారం తిరిగొచ్చానని అయితే.. సోదాల పేరుతో విమాన సిబ్బంది తనతో చాలా అనుచితంగా ప్రవర్తించారని మాళవిక ఆవేదన వ్యక్తం చేసింది. వారి చర్యలు చాలా మొరటుగా ఉన్నాయని రాసుకొచ్చింది. దీనిపై పలువురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో శుభకార్యం.. హాజరైన మెగాస్టార్!)

Advertisement
 
Advertisement
 
Advertisement