అంత పెద్దగా ఇబ్బంది పడలేదు: మలైకా | Malaika Arora Says She Overcome Virus With Minimum Pain | Sakshi
Sakshi News home page

అంత పెద్దగా ఇబ్బంది పడలేదు: మలైకా

Sep 20 2020 7:13 PM | Updated on Sep 20 2020 7:44 PM

Malaika Arora Says She Overcome Virus With Minimum Pain - Sakshi

ముంబై: ఇటీవల కరోనా పాజిటివ్‌తో బాధపడి జయించిన బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తాజాగా తన అనుభవాలను పంచుకుంది. తాను కరోనాతో పెద్దగా ఇబ్బంది పడలేదని, కొంత అసౌకర్యంగా మాత్రమే ఉండేదని చెప్పారు. కరోనా సమయంలో తనకు ధైర్యం చెప్పిన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. వైరస్‌ను జయించి బయటకు రావడంతో చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే త్వరగా కోలుకోవడానికి డాక్టర్లు చాలా సహాయం చేశారని తెలిపారు.

కరోనా నేపథ్యంలో తన అభిమానులు, శ్రేయోభిలాషులు  జాగ్రత్తగా ఉండాలని ఆకాంక్షించారు. అయితే కరోనా సమయంలో తన కుమారుడు అర్హాన్, పెంపుడు కుక్క కాస్పర్ వారిని మిస్సవుతున్నానంటూ ఇటీవల మలైకా భావోద్యేగానికి లోనయ్యారు. హోంక్వారంటైన్‌లో ఉండగా అర్హాన్, కాస్పర్‌లను మిస్‌ అవుతున్నానని మలైకా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement