Malaika Arora Reunites With Her Ex-Husband Arbaaz Khan At Airport, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Malaika Arora: మాజీ భర్తతో ఎయిర్‌పోర్ట్‌లో మలైకా.. ఫోటోలు వైరల్‌

Dec 11 2021 2:17 PM | Updated on Dec 11 2021 3:29 PM

Malaika Arora Reunites With Ex Husband Arbaaz Khan Photo Viral - Sakshi

Malaika Arora Reunites With Ex Husband Arbaaz Khan Photo Viral: బాలీవుడ్‌ నటి మలైకా అరోరా, మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్‌తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మాజీ భార్యభర్తలిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వీరి కుమారుడు అర్హాన్‌ను రిసీవ్‌ చేసుకోవడం కోసం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిన అర్హాన్‌.. క్రిస్టమస్‌ సెలవుల సందర్భంగా ఇండియా వచ్చాడు. కుమారుడిని రిసీవ్‌ చేసుకోవడం కోసం మలైకా-అర్బాజ్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. 
(చదవండి: ఎంతోసేపటిదాకా ఏడుస్తూనే ఉండిపోయా: హీరోయిన్‌)

అర్హాన్‌ని చూసి మలైకా భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడిని కౌగిలించుకుని కంట తడిపెట్టారు. అర్బాజ్‌ కూడా అర్హాన్‌ను కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశాడు. వీరు ముగ్గురు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో కూడా ఓ సారి మలైకా మాజీ భర్త అర్బాజ్‌తో కలిసి కనిపించారు. అర్హాన్‌తో కలిసి మాజీ దంపతులిద్దరూ లంచ్‌ కోసం బయటకు వెళ్లారు.  


(చదవండి: మలైకతో అర్జున్‌ డేటింగ్‌, తన గతాన్ని గౌరవిస్తున్నాను)

మలైకా-అర్బాజ్‌లకు 1998లో వివాహం అయ్యింది. 18 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. కుమారుడు అర్హాన్‌ కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. ప్రస్తుతం మలైకా హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తుండగా.. అర్బాజ్‌ ఇటాలియన్‌ మోడల్‌తో రిలేషన్‌లో ఉన్నారు. 

చదవండి: రేర్‌ వీడియో: పార్టీలో సల్మాన్‌ సోదరుల జోష్‌, వీడియో వైరల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement