రేర్‌ వీడియో: పార్టీలో సల్మాన్‌ సోదరుల జోష్‌, వీడియో వైరల్‌!

Salman Khan Dance With His Brothers Old Video Goes Viral  - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన సోదరులతో కలిస డ్యాన్స్‌ చేస్తున్న పాత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  రెండేళ్ల క్రితం సల్మాన్‌ ఖాన్‌, అర్భాజ్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌లు డ్యాన్స్‌ చేస్తున్న ఈ రేర్‌ వీడియో చివరలోనే వారి బావ ఆయుష్‌ శర్మ కూడా వారితో కాలు కదిపాడు. ఎప్పుడు షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ సల్మాన్‌ ఖాన్‌, ఆయన సోదరుడు కలిసి పార్టీలకు, కార్యక్రమాలకు హజరవడం అరుదు. ఈ నేపధ్యంలో గత 2018 క్రిస్మస్‌ వేడుకలో భాగంగా ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకచోట చేరి ఎంజాయ్‌ చేస్తున్న ఈ వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో ఈ సల్మాన్‌, అర్భాజ్‌, సోహైల్‌లు వారి బావతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియోకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

ఇక ఒక్కచోట ముగ్గురు అన్నదమ్ములను చూసి అభిమానులు, నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. దీంతో ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా సల్మాన్‌ ఇటీవల నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ మూవీ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈధ్‌ సందర్భంగా డిజిటల్‌ ప్లాట్‌ఫాం వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పలు కాంట్రవర్శీల్లో చిక్కుకుంది. విడుదలైన కొన్ని గంటల ముందే ఈ మూవీ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన రాధేలో సల్మాన్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని హీరోయిన్‌గా నటించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top