Mahesh Babu's New Look, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న మహేశ్‌ నయా లుక్‌.. ఏ కాలేజ్‌ అన్నా..?

Apr 6 2023 12:38 PM | Updated on Apr 6 2023 12:53 PM

Mahesh Babu New Look Photos Goes Viral - Sakshi

ఇండియాలోనే మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరోలలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఒకరు. ఆయన అందం గురించి ఎంత చెప్పిన తక్కువే. వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందా అన్నట్లుగా మహేశ్‌ కనిపిస్తాడు. ప్రస్తుతం ఆయన ఏజ్‌ 47 ఏళ్లు. అయినా పాతికేళ్ల కుర్రాడిలా కనిస్తాడు. మహేశ్‌ కొడుకు గౌతమ్‌ని పక్కన నిలబెడితే ఇద్దరు అన్నదమ్ముల్లా కనిపిస్తారు. అందుకే కాబోలు ఇప్పటికీ మహేశ్‌ అంటే  అమ్మాయిలకు పిచ్చి ప్రేమ. నమ్రతను చూసి ఈర్షపడే అమ్మాయిలు చాలానే ఉన్నారు. 

ఇక తాజాగా మహేశ్‌ నయా లుక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. ఒట్టో బ్రాండ్‌ షర్ట్స్‌ యాడ్‌ కోసం ఫోటో షూట్‌ చేశాడు మహేశ్‌. దానికి సంబంధిన ఫోటోలను ట్వీటర్‌లో షేర్‌ చేశాడు. అందులో మహేశ్‌ న్యూలుక్‌లో మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం మహేశ్ బాబు యాడ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఏ కాలేజ్‌ అన్నా?’ ‘ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌లా ఉన్నావ్‌’, ‘గ్రీకువీరుడు’ అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

మహేశ్‌ ప్రస్తుతం తివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది.  పూజాహెగ్డే హీరోయిన్‌. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా 2024, జనవరి 13న విడుదల కానుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement