సౌందర్యతో ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రిన్స్.. ఏ సినిమానో తెలుసా? | Sakshi
Sakshi News home page

Article ad after second para

Mahesh Babu: మహేశ్ బాబుతో సినిమా.. సౌందర్యనే ఆ విషయం స్వయంగా చెప్పిందట!

Published Tue, Nov 7 2023 6:16 PM

Mahesh Babu Missed The Cinema Chance With Star Actress Soundarya - Sakshi

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో అలరించనుంది. అయితే రాజ కుమారుడు చిత్రంతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మహేశ్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తాజాగా మహేశ్‌ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 

(ఇది చదవండి: హౌస్‌ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్‌లో సీమంతం వేడుకలు!)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగువారికి పరిచయం అక్తర్లేని పేరు. అప్పటి స్టార్ హీరోలందరితో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. అయితే సౌందర్యతో నటించే ఛాన్స్ మహేశ్ బాబు మిస్ అయినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో రావాల్సిన మూవీలో మరో హీరోయిన్ నటించింది.  

రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తర్వాత యువరాజు చిత్రంలో నటించారు. ఇందులో ప్రిన్స్ సరసన సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా కనిపించారు. అయితే ఈ చిత్రంలో ముందుగా సిమ్రాన్ స్థానంలో డైరెక్టర్ సౌందర్యనే ఎంపిక చేశారు. అయితే సౌందర్య- మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కావడంతో వీరిద్దరి కెమిస్ట్రీ అంతగా వర్కవుట్‌ కాలేదట. ఎలా చూసిన మహేశ్‌కు అక్కలా కనిపిస్తున్నానని.. ఈ విషయాన్ని స్వయంగా సౌందర్యనే డైరెక్టర్‌ వైవీఎస్ చౌదరికి చెప్పిందట.

(ఇది చదవండి: రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘ అశ్వధామ’.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌)

ఈ పాత్రకు తనకంటే సిమ్రాన్‌ ఫర్‌ఫెక్ట్‌గా సెట్‌ అవుతుందని సౌందర్య సూచించిదట. దీంతో డైరెక్టర్ సౌందర్యకు బదులుగా సిమ్రాన్‌ను ఎంపిక చేశారు. అలా సౌందర్య- మహేశ్ బాబు జోడిని వెండితెరపై చూసే ఛాన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ కోల్పోయారు. లేదంటే మహేష్ బాబు - సౌందర్య జోడీని తెలుగువారు చూసే అవకాశం దక్కేది. కాగా.. సౌందర్య 2004లో బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. యువరాజు సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలోని గుంతలక్కడి గుమ్మ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement