హౌస్‌ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్‌లో సీమంతం వేడుకలు! | Bigg Boss Gives Emotional Surprise For Ambati Arjun In House | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్ బాస్‌లో సీమంతం వేడుకలు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన అర్జున్!

Nov 7 2023 4:55 PM | Updated on Nov 7 2023 5:20 PM

Bigg Boss Gives Emotional Surprise For Ambati Arjun In House  - Sakshi

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. సోమవారం రాగానే హౌస్‌లో నామినేషన్ల పర్వం మొదలవుుతంది. నామినేషన్ల మొదటి రోజే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సారి కాస్తా ప్రత్యేకంగా మ‌హారాజ్యంలో జ‌రుగుతాయ‌ని తెలిపారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియ కాస్తా ఆసక్తిని పెంచింది. 

అలా ఈ వారంలో జరిగిన నామినేషన్స్‌లో ఏర్పాటు చేసిన రాజ్యంలో శోభ‌, ప్రియాంక‌, అశ్విని, ర‌తికల‌ను రాజ‌మాత‌లుగా ప్ర‌క‌టించాడు. శంఖారావం వ‌చ్చిన ప్ర‌తిసారి ఇద్ద‌రు కంటెస్టెంట్లు క‌త్తుల‌ను బ‌య‌ట‌కు తీసి.. మిగిలిన వారిలో ఎవ‌రిని నామినేట్ చేయాల‌నుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రి నామినేష‌న్ స‌బ‌బు అనిపిస్తే వారిని రాజ‌మాత‌లు నేరుగా నామినేట్ చేస్తారు. అయితే ఈ వారంలో భోలె షావ‌ళి, శివాజీ, గౌత‌మ్‌, ప్రిన్స్ యావ‌ర్‌, ర‌తిక రోజ్ నామినేష‌న్స్‌లో నిలిచారు.

ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో బిగ్‌ బాస్‌ హౌస్‌ను ఫుల్‌ ఎమోషనల్‌గా మార్చేశారు. ఈ వారంలో కంటెస్టెంట్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌లతో ముందుకొచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో శివాజీ కుమారుడిని డాక్టర్‌గా పంపించి హౌస్‌లో ఎమోషన్ పండించారు.

శివాజీకి సర్‌ప్రైజ్

తాజాగా రిలీజైన ప్రోమోలో మరో కంటెస్టెంట్ అంబటి అర్జున్‌కు బిగ్ బాస్ బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన భార్య సురేఖ హౌస్‌లోకి తీసుకొచ్చారు. దీంతో తన భార్యను చూసిన అర్జున్ ఫుల్ ఎమోషనలయ్యాడు. భార్య, భర్తల అనుబంధం ఏంటనేది వీళ్లిద్దరి చూస్తే తెలిసిపోతుంది. హౌస్‌లో అడుగుపెట్టిన అర్జున్ భార్య.. భర్తకు గోరుముద్దలు తినిపించింది. నీ ఎమోషన్స్‌ను బయటపెట్టు.. నువ్వు సరిగా రియాక్ట్ అవ్వట్లేదంటూ తన భర్తకు సలహాలు కూడా ఇచ్చింది. ఇది చూసిన శివాజీ.. దిస్ ఇజ్ లైఫ్ అంటూ కొటేషన్ ఇచ్చేశాడు. 

అర్జున్ భార్యకు సీమంతం

అయితే ప్రస్తుతం అర్జున్ భార్య గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. హోస్‌లో అడుగుపెట్టిన ఆమెకు కంటెస్టెంట్స్ అందరూ కలిసి సీమంతం వేడుక నిర్వహించారు. హౌస్‌మేట్స్ ఎంతో సంతోషంగా ఆమెకు సీమంతం నిర్వహించడంతో అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య సీమంతం చూసి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆమె హౌస్‌ నుంచి బయటకెళ్తుండగా ఫుల్ ఎమోషనలయ్యారు. ఈ ప్రోమోలు చూస్తే మొత్తానికి బిగ్‌ బాస్‌ హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement