స్విట్జర్లాండ్‌కు మహేశ్‌బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో వైరల్ | Mahesh Babu and Namrata Shirodkar share pics from Switzerland with their children | Sakshi
Sakshi News home page

Mahesh Babu: స్విట్జర్లాండ్‌కు మహేశ్‌బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో వైరల్

Dec 27 2022 9:42 PM | Updated on Dec 27 2022 9:51 PM

Mahesh Babu and Namrata Shirodkar share pics from Switzerland with their children - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్‌- నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. అయితే న్యూ ఇయర్‌ వేడుకల కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 

మహేష్ బాబు అతని భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో క్రిస్మస్ చెట్టు వద్ద ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా మహేశ్ సతీమణి నమ్రత అదే ఫోటోను షేర్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందే నమ్రత ఒక కప్పు పానీయంతో కుర్చీలో కూర్చుని సితార ఫోన్‌ బ్రౌజ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.  కొద్ది రోజుల క్రితమే మహేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. సెలవులు ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. 

కాగా.. మహేశ్‌ బాబు దర్శకుడు త్రివిక్రమ్‌తో తన తదుపరి చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో ఒక ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. మహేశ్ చివరిసారిగా సర్కారు వారి పాట సినిమాలో లోన్ ఏజెంట్‌గా కనిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement