Mahesh Babu 30th Movie: రాజమౌళి గురించి తెలిసి కూడా మహేశ్‌ ఆ పని చేశాడా?

Mahesh Babu 30th Movie With Sukumar, Rumours Goes Viral - Sakshi

దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఈజీగా రెండేళ్లు పడుతుంది. అంతకంటే ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మహేశ్‌ బాబుతో తీయబోయే సినిమా మాత్రం పక్కా రెండేళ్లలో పూర్తి చేస్తానని చెబుతున్నాడు. కానీ  ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్నది  రేండేళ్లు ఆగితే కాని తెలియదు. ఇప్పటి వరకు అయితే ఇచ్చిన మాట రాజమౌళి ఎప్పుడు నిలబెట్టుకోలేదు. ప్రతీసారి ఏళ్ల ఏళ్లు సినిమాలు తీస్తూనే వస్తున్నాడు.

రాజమౌళి గురించి తెలిసి కూడా మహేశ్‌ బాబు కొత్తసినిమా పై ఇప్పుడే ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. మహేశ్‌ కెరీర్ లో తెరకెక్కే 30 చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో మూవీ తర్వాత సుకుమార్ లేదా సందీప్ వంగాతో సినిమా చేసేందుకు మహేశ్‌ ఇప్పటి నుంచే చర్చలు జరుపుతున్నాడట.

(చదవండి: అప్పుడే డైరెక్టర్‌ సక్సెస్‌ అయినట్టు!)

అదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే. కాని ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ముందు రాజమౌళితో మూవీ కంప్లీట్ కావాల్సి ఉంటుంది. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌ వేశాడు. తిరిగి ఇండియాకు రాగానే త్రివిక్రమ్‌ మూవీని పట్టాలెక్కించనున్నాడు. 2023 ప్రారంభంలో రాజమౌళి- మహేశ్‌ బాబు కొత్త సినిమా ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top