సినిమాలోని అందరూ 'మహానటులే'.. | Maha Natulu: Character Reveal Posters Unveiled | Sakshi
Sakshi News home page

సినిమాలోని అందరూ 'మహానటులే'..

Jan 2 2022 8:08 AM | Updated on Jan 2 2022 8:22 AM

Maha Natulu: Character Reveal Posters Unveiled - Sakshi

Maha Natulu: Character Reveal Posters Unveiled: అభినవ్‌ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్‌ రమేష్, భరత్‌ రెడ్డి ముఖ్య తారలుగా అశోక్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహానటులు’. అనిల్‌ బొడ్డిరెడ్డి, తిరుపతి ఆర్‌ యర్రం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్యారెక్టర్‌ రివీలింగ్‌ పోస్టర్‌ లాంచ్‌ కార్యక్రమంలో అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ –

‘‘టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమాలోని అందరూ మహానటులే. నలుగురు వ్యక్తులు మహానటులు అనే యూట్యూబ్‌ చానెల్‌ను స్టార్ట్‌ చేసి, ఎలా డెవలప్‌ చేశారన్నదే కథ’’ అన్నారు. ‘‘ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తాం’’ అన్నారు అనిల్‌. ‘‘ఈ సినిమా బాగా వచ్చింది. త్వరలో ఎమ్మెల్యే సీతక్క బయోపిక్‌ నిర్మించనున్నాం’’ అన్నారు తిరుపతి. 

Advertisement
 
Advertisement
Advertisement