సెన్సార్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు

Madras High Court Orders To Remove Particular Scenes In Mandela Movie - Sakshi

మండేలా చిత్ర వ్యవహారంపై సెన్సార్‌ బోర్డుతోపాటు చిత్ర దర్శక నిర్మాతలకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హాస్య నటుడు యోగిబాబు టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం మండేలా. ఇది ఈ నెల 4న ఓటీటీలో విడుదలైంది. మండేలా చిత్రాన్ని రీ సెన్సార్‌ చేయాలని తమిళనాడు క్షురవకుల సంఘం తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా చిత్రంలో క్షురవకుల జాతి మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించేలా చిత్ర నిర్మాతలకు ఆదేశించాలని కోరారు. న్యాయమూర్తి మహదేవన్‌ విచారణ చేపట్టి వివరణ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డు, మండేలా చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 28కి వాయిదా వేశారు. 

చదవండి: సైనికుడిగా దుల్క‌ర్ స‌ల్మాన్.. కొత్త సినిమా గ్లిమ్స్ విడుద‌ల‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top