Pop Singer Madonna Hospitalised With Serious Infection, Postpones Her World Tour - Sakshi
Sakshi News home page

Pop Singer Madonna Hospitalised: 'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్‌

Published Thu, Jun 29 2023 9:53 AM

Madonna Hospitalised With Serious Infection Postpones Her World Tour - Sakshi

అమెరికన్ పాపులర్‌ సింగర్‌  మడోన్నా ప్రపంచ వ్యాప్తంగా తన గాత్రంతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ గత కొద్దిరోజులుగా వరల్డ్‌ టూర్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె అనారోగ్యానికి గురైయారు. ఆమెతో పాటు  కుమార్తె లూర్డ్ లియోన్ కూడా జబ్బున పడ్డారు. దీంతో వారిద్దరూ న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు. 

(ఇదీ చదవండి: SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!)

ఇదే విషయాన్ని మడోన్నా మేనేజర్, గై ఓసీరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటన చేశారు. కొద్దిరోజులుగా ఆమె బ్యాక్టీరియా వల్ల  తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైయారని తెలిపాడు. దీంతో ఆమెకు అత్యవసరంగా చికిత్స అందించేందుకు  ICUలో చేర్పించాల్సి వచ్చిందని ఆయన తెలిపాడు. ప్రస్థుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని, అయితే ఆమె ఇంకా వైద్య సంరక్షణలో ఉండాల్సి వస్తుందని ఆయన ప్రకటించాడు. దీంతో ఆమె ముందుగా ఒప్పుకున్న అన్ని ప్రోగ్రామ్‌లకు తాత్కాలికంగా కొంతమేరకు విరామం ఇస్తున్నట్లు ఆయన తెలిపాడు. మడోన్నా కోలుకున్న తర్వాత మళ్లీ ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తారని తెలిపారు.

మడోన్నా అనారోగ్యానికి గురికావడం వల్ల తప్పని సమయంలో  ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆమె పర్యటనకు సంబంధించి కొత్త  తేదీలను  రీషెడ్యూల్ చేస్తామన్నారు ఆ షోల వివరాలను త్వరలో తెలుపుతామని పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: డైరెక్టర్‌కి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. ఎన్ని లక్షలో తెలుసా?)

మడోన్నా తన సంగీత కెరీర్ 40వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకోవడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో 'సెలబ్రేషన్' పర్యటనను ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తన గానంతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. ఈ పర్యటనను జూలై 15న వాంకోవర్‌లో ప్రారంభమై US,  యూరప్‌కు వెళ్లే ముందు డిసెంబర్ 1న ఆమ్‌స్టర్‌డామ్‌లో ముగుస్తుందని ఆమె గతంలో తెలిపింది. ఇప్పుడు ఆమె అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు చింతిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు. 


Advertisement
 
Advertisement
 
Advertisement