Madhoo Shah Reveals Why She Decided To Quit Movies, Here Reason - Sakshi
Sakshi News home page

Madhoo: అందుకే సినిమాల నుంచి తప్పుకున్నా: శాకుంతలం నటి

Apr 12 2023 2:00 PM | Updated on Apr 12 2023 3:13 PM

Madhoo Open About typecast in films All the heroines were typecast - Sakshi

మధు అంటే సినీఇండస్ట్రీలో పెద్దగా గుర్తు పట్టరేమో కానీ.. మధుబాల అంటే ఠక్కున గుర్తుకొస్తుంది. ఆమె అసలు పేరు మధు అయితే సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది. ఆమెకు అంతలా పేరు తీసుకొచ్చిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా. ఆమె  ఒట్టయల్ పట్టాలమ్‌ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో సినిమాలోనే కె.బాలచందర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో మధుబాల నటించింది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ మేనక పాత్రలో నటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లింగవివక్షపై మధుబాలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన లింగవివక్ష, టైప్‌కాస్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకానొక సమయంలో తన నటనా జీవితం ముగిసే సమయానికి.. తనకు తగిన పాత్రలు లభించలేదని ఆమె చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అలియా భట్ ఆ పరిస్థితిని ఇండస్ట్రీలో పూర్తిగా మార్చేశారని మధు ప్రశంసించారు.

టైప్‌క్యాస్ట్‌ గురించి మధు మాట్లాడుతూ..'నేను హీరోయిన్‌ పాత్రలే పోషించా. కాబట్టి ఆ సమయంలో హీరోయిన్లందరూ టైప్‌కాస్ట్ చేశారు. మాకు కొన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. డ్యాన్స్ చేశాం. వాటిలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా చేశా. పలు భాషలలో వైవిధ్యమైన పాత్రలు పోషించా.  దాని గురించి నాపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. నాకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించా. అప్పుడు ఇంకా ఎక్కువ సినిమాల్లో నటించాలని అనుకున్నా. కానీ నాకు తగిన పాత్రలు రాలేదు.' అని చెప్పుకొచ్చారు. 

రోజా సినిమాలో నటించడంపై మధు మాట్లాడుతూ..'నేను చాలావరకు యాక్షన్ హీరోల సినిమాల్లో నటించా. వారిలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, అజయ్ దేవగన్‌లతో నటించా. యోధ, రోజా వంటి చిత్రాలు చేశా. దక్షిణాదిలో కూడా ఇలాంటి సినిమాలు రావాలని కోరుకున్నా. కానీ అది జరగలేదు. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇందులో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.' అని అన్నారు. 

దేవ్ మోహన్, గౌతమి, మధు, అదితి బాలన్, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటించిన శాకుంతలం చిత్రంలో మధు మేనక పాత్రలో కనిపించనుంది. కవి కాళిదాసు నాటకం అభిజ్ఞానశాకుంతలం ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈచిత్రం ఈనెల 14న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement