'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే? | Mad Square Day 2 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Mad Square Collection: కుర్రాళ్లు చితక్కొట్టేశారు.. అన్ని కోట్ల వసూళ్లు

Mar 30 2025 2:39 PM | Updated on Mar 30 2025 3:16 PM

Mad Square Day 2 Collection Worldwide

ఈసారి ఉగాది కానుకగా థియేటర్లలోకి నాలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా, రెండు డబ్బింగ్ బొమ్మలు. కానీ వీటిలో మ్యాడ్ స్క్వేర్ మాత్రమే ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజులో వచ్చాయి. ఏకంగా రెండో రోజుకే లాభాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్')

2023లో మ్యాడ్ మూవీ రిలీజైనప్పుడు.. ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ పై హైప్ బాగానే ఏర్పడింది. ‍మొదటితో దానితో పోలిస్తే అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నప్పటికీ యూత్ అంతా దీనికే ఓటు వేస్తున్నారు. కామెడీ మూవీ కావడం కూడా దీనికి ప్లస్ అయింది.

‍అలా మ్యాడ్ స్క్వేర్ మూవీకి రెండు రోజుల్లో రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. తొలిరోజు ఎంతొచ్చిందనేది మాత్రం బయటపెట్టలేదు. ఈ సినిమా ఓవర్సీస్ లోనూ ($850k) మిలియన్ డాలర్ వసూళ్లకు దగ్గరగా ఉంది. ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్ లో రూ.100 కోట్ల మార్క్ చేరినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్'.. ఫారెన్ పోలీస్?)

Advertisement
 
Advertisement
Advertisement