MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్‌ మేనిఫెస్టో ఇదే

MAA Elections 2021: Manchu Vishnu Announced His Panel Manifesto - Sakshi

Manchu Vishnu Panel Manifesto: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తమ ప్యానల్‌ని గెలిపిస్తే.. ఒక యాప్ క్రియేట్ చెసి దాని సహకారంతో నటులందరికి అవకాశాలు ఇప్పించడంతో పాటు రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడిన అర్హులైన ఆర్టిస్ట్‌లకు సొంత ఇల్లు కట్టిస్తామని ‘ మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు గురువారం తన ఫ్యానల్‌కు సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేశారు. 

మంచు విష్ణు ప్యానెల్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు

  • ఒక యాప్ క్రియేట్ చెసి దాని సహకారంతో అందరికి అవకాశాలు ఇప్పిస్తాం 
  • అర్హులైన సభ్యులకు సొంత ఇళ్లు 
  •  మా సభ్యుల పిల్లల విద్యకు ఆర్థిక చేయూత
  •  సొంత డబ్బులతో ‘మా’భవనం
  • ప్రతీ ఒక్కరికి ఫ్రీ హెల్త్ 
  • మహిళల రక్షణకి హై పవర్ కమిటీ
  • ‘మా’సభ్యుల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్‌
  • కల్యాణలక్ష్మీ తరహాలో రూ.1.16 లక్షలు
  • అర్హులైన సభ్యులకు పెన్షన్లు
  • ‘మా’సభ్యత్వ ఫీజు రూ.75 వేలకు తగ్గింపు
  • ‘మా’సభ్యుల కోసం జాబ్‌ కమిటీ ఏర్పాటు
     

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top