MAA Elections 2021 Results: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

MAA Elections 2021: Couting Process Of Maa Elections Has Started - Sakshi

MAA Elections 2021 Counting Live Updates :

మంచు విష్ణు విజయం
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ జోష్‌లో ఉంది.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొందింన ఆఫీస్‌ బేరర్లు వీళ్లే..
జాయింట్‌ సెక్రటరీగా ఉత్తేజ్‌ విజయం
వైస్‌ ప్రెసిడెంట్‌గా బెనర్జీ విజయం
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌ విజయం

మంచు విష్ణు ప్యానల్‌ నుంచి గెలుపొందింన ఆఫీస్‌ బేరర్లు వీళ్లే..
వైస్‌ ప్రెసిడెంట్‌గా మాదల రవి విజయం
జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు విజయం
ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం
జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు విజయం

బాబూ మోహన్‌పై శ్రీకాంత్‌ గెలుపు
జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ గెలుపొందారు. బాబూ మోహన్‌పై శ్రీకాంత్‌ విజయం సాధించారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్యానల్‌  నుంచి పృథ్వీ రాజ్‌ ఆధిక్యంలో ఉన్నారు.

ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు ఆధిక్యం
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ముందంజలో ఉన్నారు. ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ ముందంజలో ఉన్నారు. 

7ఓట్ల తేడాతో జీవితపై రఘుబాబు గెలుపు
మా జనరల్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు గెలుపొందారు. జీవితా రాజశేఖర్‌పై 7ఓట్ల తేడాతో రఘుబాబు విజయం సాధించారు. ట్రెజరర్‌గా మంచు విష్ణు ప్యానెల్‌ నుంచి శివ బాలాజీ 32 ఓట్ల తేడాతో గెలుపొందారు. శివబాలాజీకి 316 ఓట్లు, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌కు చెందిన నాగినీడుకు 284 ఓట్లు వచ్చాయి. 

ఆఫీస్‌ బేరర్ల ఓట్లు కౌంటింగ్‌
ఆఫీస్‌‌ బేరర్ల ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ట్రెజరర్ల ఓట్లను లెక్కిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్లుగా మంచు విష్ణు ప్యానల్‌ నుంచి బాబూమోహన్‌,ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ పోటీ చేశారు. ట్రెజరర్లుగా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి నాగినీడు, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి శివ బాలాజీ పోటీ చేశారు. మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

మంచు విష్ణు ప్యానల్‌లో 9 మంది విజయం
మంచు విష్ణు ప్యానల్‌ నుంచి 9 మంది ఈసీ సభ్యులు విజయం సాధించారు. మాణిక్‌, హరినాథ్‌, బొప్పన,శివ, జయవాణి, శశాంక్‌, పూజిత, పసునూరి, శ్రీనివాస్‌, శ్రీలక్ష్మీ గెలుపొందారు. అటు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లో 9మంది గెలుపొందారు. 

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో ఈసీ మెంబర్ల కౌంటింగ్‌ ముగిసింది. మంచు విష్ణు ప్యానల్‌లో 10మంది ఈసీ సభ్యులు లీడ్‌లో ఉండగా, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి 8మంది సభ్యులు లీడ్‌లో ఉ‍న్నారు. క్షణక్షణానికి లీడ్స్‌ మారుతున్న నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠగా మారాయి. 

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో నలుగురు ఈసీ సభ్యులు గెలుపొందారు. కౌశిక్‌, శివారెడ్డి, సురేష్‌ కొండేటి.. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొందారు. అటు విష్ణు ప్యానెల్‌ నుంచి మాణిక్‌, హరినాథ్‌, బొప్పన,శివ, జయవాణి, శశాంక్‌, పూజిత, పసునూరి, శ్రీనివాస్‌, శ్రీలక్ష్మీ ముందంజలో ఉన్నారు. 

తొలి ఫలితం
తొలి ఫలితం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానలే బోణీ కొట్టింది. ఈసీ మెంబర్లు కౌశిక్‌, శివారెడ్డి ప్రకాశ్‌రాజ్‌ ఫ్యానల్‌ నుంచి గెలుపొందారు. 

పోస్టల్‌ బ్యాలెట్లలో మంచు విష్ణు ముందంజ
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ ఆధిక్యంలో ఉంది. మంచు విష్ణు ప్యానెల్‌లో 10మంది ఈసీ సభ్యులు ముందంజలో ఉన్నారు.

భారీగా క్రాస్‌ ఓటింగ్‌
పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో 50 చెల్లనివిగా గుర్తించారు. మోహన్‌ బాబు, మురళీ మోహన్‌ సమక్షంలో కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈసీ మెం‍బర్లలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

కౌంటింగ్‌ కోసం ఆరు టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై ఇద్దరికి అనుమతి ఇచ్చారు. మొత్తం 665 ఓట్లు పోలవగా ఇందులో పోస్టల్‌ బ్యాలెట్‌ నుంచి 60 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్ట్‌లో బ్యెలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది మరికాసేపట్లో తేలనుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top