'లక్కీ భాస్కర్‌' బ్యాంక్‌ ఖాతాలో కోట్లలో డబ్బు.. ఆసక్తిగా టీజర్‌ | Lucky Baskhar Teaser Out Now | Sakshi
Sakshi News home page

'లక్కీ భాస్కర్‌' బ్యాంక్‌ ఖాతాలో కోట్లలో డబ్బు.. ఆసక్తిగా టీజర్‌

Apr 11 2024 5:03 PM | Updated on Apr 11 2024 5:30 PM

Lucky Baskhar Teaser Out Now - Sakshi

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కొత్త సినిమా లక్కీ భాస్కర్‌.. పుష్కర కాలం పాటు ఆయన ఎన్నో చిత్రాలతో మెప్పించారు.  మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్‌. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైన సమయం నుంచి ఆసక్తిని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వెంకీ అట్లూరి డైరెక్ట్‌ చేస్తున్నారు. దుల్కర్‌ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది.

'మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే పాత్రలో దుల్కర్ కనిపించారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్‌’. దుల్కర్‌ సల్మాన్‌ టైటిల్‌ రోల్‌లో నటించనున్న సినిమా ఇది.

‘లక్కీ భాస్కర్‌’ టీజర్‌ను గమనిస్తే డబ్బు చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్‌ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్‌’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement